అతనికి చెల్లెలు అవుతుంది! | sruthi hasan Yarra movie is getting ready to release | Sakshi
Sakshi News home page

అతనికి చెల్లెలు అవుతుంది!

Published Fri, Nov 4 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

అతనికి చెల్లెలు  అవుతుంది!

అతనికి చెల్లెలు అవుతుంది!

తెలుగు, తమిళ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా హిందీలో శ్రుతీహాసన్ ఏడాదికి ఒక సినిమా అయినా ఒప్పుకుంటారు. వీలైతే రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. శ్రుతి నటించిన హిందీ చిత్రం ‘యారా’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మరో చిత్రం అంగీకరించారు. ‘బెహెన్ హోగీ తేరి’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ సరసన శ్రుతి నటించనున్నారు. అంటే.. ‘ఆమె నీకు చెల్లెలు అవుతుంది’ అని అర్థం. మరి.. సినిమాలో శ్రుతీని ఉద్దేశించి ఏ పాత్ర ఇలా అంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పంజాబీలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ కె. పన్నాలాల్ ఈ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమవుతున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలుపెట్టి, జనవరిలో పూర్తి చేయాలనుకుంటున్నారు.

నితిన్ సరసన?
శ్రుతి చేస్తున్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సరసన ‘కాటమరాయుడు’లో నటిస్తున్నారు. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్న చిత్రంలో ఆమెను కథానాయికగా అడిగారట. ఈ సినిమాలో నటించడానికి శ్రుతి సుముఖంగానే ఉన్నారని సమచారం. డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట. శ్రుతీహాసన్ ఈలోపు డైరీ చెక్ చేసుకుని, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement