రవితేజ పోలీస్ అనగానే ‘విక్రమార్కుడు’ సినిమాలోని టఫ్ పోలీస్ గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పోలీసాఫీసర్‌గా నటించనున్నారు రవితేజ. ఇది రవితేజకు 66వ చిత్రం. గురువారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. సరస్వతి ఫిలింస్ డివిజన్‌పై బి. మధు (ఠాగూర్ మధు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో రవితేజ హీరోగా నటించిన రెండు చిత్రాలకు (డాన్ శీను, బలుపు) దర్శకత్వం వహించిన మలినేని గోపీచంద్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment