Malineni Gopichand
-
ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఆగిపోయిన రవి తేజ, గోపీచంద్ మూవీ
-
ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని
తనపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్పందించారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో గోపిచంద్ మలినేని స్టేజ్ మాట్లాడుతూ శృతి హాసన్‌కు ఐ లవ్ యూ అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడిన శృతి తెలుగు ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నారంటూ గోపీచంద్ గురించి చెప్పింది. వీర సింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత ట్రోల్స్ రావడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘శృతితో నాకు ఇది మూడో సినిమా. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి చేశాను. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె. తను నాకు ఓ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ మాది. చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్! నా వైఫ్‌తో కూడా తను చాలా క్లోజ్. నా కొడుకు సాత్విక్ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి తరచూ చాక్లెట్స్, గిప్ట్స్ తీసుకువస్తుంది. అందుకే ఆమె స్టేజ్‌పై నాకు అన్నయ్య అని చెప్పంది. ఆ తర్వాత నేను మాట్లడినప్పుడు తను చెప్పిన దానికి నా కన్సన్ చూపించాను. ఈ నేపథ్యంలో ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి-అమ్మాయి లవ్‌గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చించుకుంటున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. వీరసింహారెడ్డిపై ట్విటర్లో అటు పాజిటివ్..ఇటు నెగెటివ్ రెండు రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని, బాలయ్య మాస్ మిస్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం చాలా బాగుందని చెబుతున్నారు. Review - #VeeraSimhaReddy 1st half routine rotta 2nd half " average '' Balayya masss miss ayyam 🤣🤭 Duniya Vijay 🤝🙌💥@shrutihaasan Okayish 2 Songs 💥✨️💃🕺 B🔥G🔥M 👌❤️🔥 @MusicThaman 1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5 — chowVIEW (@chow_view) January 12, 2023 #VeeraSimhaaReddy #VeeraSimhaReddy Senseless first half and Senior Bala's character is disappointing. Imagine the second half now.. 😭😭 — That Scooby doo villain (@smile_fakeit) January 12, 2023 Excellent 1st half Elevations Emotions Pelli scene fight Pulicherala mailu rayi fight Minster ki warning 🔥🔥🔥#VeeraSimhaaReddy https://t.co/gzwiaLBB3i — Nari Kakarla 🇮🇳 | #RC15™ (@RamCharanCult27) January 12, 2023 పస్టాఫ్ బాగుంది. ఎలివేషన్స్, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. పెళ్లి సీన్ ఫైట్, పులిచర్ల మైలు రాయి ఫైట్ సీన్‌తో పాటు మంత్రికి బాలయ్య ఇచ్చే వార్నింగ్ సన్నివేశం అదిరిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 First Half Reports : ఊహించిందే జరిగింది .... ⭐️మాస్ జాతర ... ⭐️నందమూరి నటసింహం గర్జన .... ⭐️ BGM ⭐️ Thundering Action Blocks #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaaReddy #NBK #Balayya #GodOfMassesNBK ☀️#CinemaYePrapancham 🔔 pic.twitter.com/3ZEdxF7M8G — Cinema Ye Prapancham (@cinema_ye) January 12, 2023 First Half : High Voltage First Half Ee character Chala Powerful Chala Rojulu Tarvata బ్రహ్మనందం Ni Big Screen Meeda Chusa First Lo 20mins Koncham Forced Ga Chusa Oka Vakeel Saab Oka Akhanda Oka VeeraSimha Reddy Chala Baga Kottadu #VeeraSimhaaReddy#VeeraSimhaReddy pic.twitter.com/OEc5I3TWrN — Sadhik⚡ (@CharanismSadhik) January 12, 2023 Block buster 1st half 🔥🔥🔥 Muthi meeda bochu molichina pratodu magadu kadura bacha..... Waiting for second half #VeeraSimhaReddy #VeeraSimhaaReddy https://t.co/qZsxWNCODJ — Nandamuri Dhoni (@m416kishore) January 12, 2023 complete 1st off OMG 👌💥 Movie లో ఈ గెటప్ సూపర్ 🔥🔥@MusicThaman Anna BGR ke Theatre🔥🥵💥 @shrutihaasan Suguna Sundari Dance 👌🔥 @varusarath5 in interval 🔥🔥🔥👌 #Balakrishna action sequences🔥dialogues Delivery 🔥 @MythriOfficial#VeeraSimhaaReddy#VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/4QSw7x3ITR — N.Ashok Gowda (@07Ashok_gowda) January 12, 2023 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 -
బాలయ్య సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. అఖండ తర్వాత వెంటనే గోపించంద్ మలినేని మూవీని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమాతో మరిన్ని ప్రాజెక్టస్ చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో ఎన్బీకే107(#NBK107) మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్ పోష్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులుగా బాలయ్య రెండు పాత్రలు చేయనున్నాడట. ఇందులో ఒక హీరోయిన్ శ్రుతి హాసన్‌గా సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్నాడట గోపించంద్ మిలినేని. దీంతో ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించగా.. దానికి ఆమె నో చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కృతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మరో భారీ విజయాలను ఆమె ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తుండటంతో డేట్స్ సర్ధుపాటు కాక బాలయ్య సినిమాకు ఆమె నో చెప్పినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అలాగే ప్రస్తుతం లీడ్ హీరోయిన్ ఆఫర్స్ వస్తున్న క్రమంలో సెకండ్ హీరోయిన్ నటించడం వల్లే కెరీర్‌పై దెబ్బ పుడుతుందనే భయంతో కూడా ఈ మూవీ ఆఫర్‌ను తిరస్కరించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బేబమ్మ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. -
‘మెంటల్’ అంటున్న సమంత, మంటపెట్టేశారన్న సిద్ధార్థ్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఆర్ఆర్ఆర్ నుంచి ఒక్కొ అప్డేట్ వదులుతున్నారు. ఇవాళ ఈ మూవీ నుంచి మాస్ అంథం పేరుతో చిత్ర బృందం సెకండ్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలను సైతం ఆకట్టుకుంటోంది. చరణ్, తారక్‌లు మాస్ స్టెప్పులతో ఉర్రుతలుగించారు. వారి డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. దీంతో ఈ పాటపై పలువురు టాలీవుడ్ స్టార్స్‌తో పాటు డైరెక్టర్లు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలుపుతున్నారు. అలాగే సమంత సైతం ఈ సాంగ్‌పై స్పందించారు. ఈ పాటలోని ఓ క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. మెంటల్ అంటూ కామెంట్ చేశారు. అంతలా ఈ పాటకు తను ఫిదా అయినట్లు సామ్ చెప్పకనే చెప్పారు. ఇక సమంతతో పాటు పలువురు సినీ డైరెక్టర్లు సైతం ఈ పాటపై కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్ ఈ పాటకు థియేటర్లలో విస్పోటనం ఖాయం అంటూ దర్శకుడు మలినేని గోపీచంద్ కామెంట్ చేయగా.. ‘ఇది ఊరనాటు’ అంటూ అనిల్ రావిపూడి ప్రశంసించాడు. మరో యువ దర్శకుడు బాబీ ‘వాట్ ఏ ఊరనాటు సాంగ్ దిస్ ఈజ్!’ అని పోస్ట్ చేశాడు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ‘నాటు’కు పోయింది పాట! అంటూ కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు. ఇక హీరో సిద్ధార్థ్ కూడా ఈ పాటపై తన స్పందనను తెలిపాడు. సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ.. ‘ఎగ్జైయిట్మెంట్ను ఆపుకోలేకపోతున్నా. ఇండియన్ సినిమాలో గొప్ప డ్యాన్సర్లైయిన రామ్‌చరణ్, తారక్‌లు కలిసి మంటపెట్టెస్తున్నారు. ఇక ఈ పాటకు థియేటర్లో ఇక అరుపలే.. ఇదే రాజమౌళి మ్యాజిక్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ రాసుకొచ్చాడు. Can't control my excitement.. India's finest dancers @tarak9999 and @AlwaysRamCharan setting the screen on fire. Theaters will roar! Just @ssrajamouli things. @mmkeeravaani garu rampage! Mind = Blown.https://t.co/vZAq0fl2Fu — Siddharth (@Actor_Siddharth) November 10, 2021 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్‌లు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసిందని అన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణతో సినిమా: దర్శకుడు గోపిచంద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో హీరో బాలకృష్ణ తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో ఆమెను సత్కరించారు. అదేవిధంగా.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా న్యాయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు. కాగా, అంతకు ముందు రోజు గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని జస్టిస్ బీవీ నాగరత్న కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ శ్రీసుధా తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
టఫ్ పోలీస్
రవితేజ పోలీస్ అనగానే ‘విక్రమార్కుడు’ సినిమాలోని టఫ్ పోలీస్ గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పోలీసాఫీసర్‌గా నటించనున్నారు రవితేజ. ఇది రవితేజకు 66వ చిత్రం. గురువారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. సరస్వతి ఫిలింస్ డివిజన్‌పై బి. మధు (ఠాగూర్ మధు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో రవితేజ హీరోగా నటించిన రెండు చిత్రాలకు (డాన్ శీను, బలుపు) దర్శకత్వం వహించిన మలినేని గోపీచంద్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
చెన్నైలో పండగ...
చెన్నైని చూస్తే రామ్ మనసు పులకించి పోతుందట. ఎందుకంటే రామ్ పుట్టిందీ, పెరిగిందీ అక్కడే. అందుకే అవకాశం దొరికితే చెన్నైలో వాలిపోతారు రామ్. ఇప్పుడు రామ్ అక్కడే ఉన్నారు. ఇవాళ రామ్ పుట్టిన రోజు. ఈ వేడుకను చెన్నైలోనే జరుపుకోనున్నారు. ‘పండగ చేస్కో’ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ సంగీత చర్చలు జరుగుతున్నాయి. చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్‌తో కలిసి రామ్ కూడా సరదాగా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ‘మసాలా’ విడుదలైన ఆరు నెలల విరామం తర్వాత రామ్ చేస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ నెల 17న చిత్రీకరణ మొదలు కానుంది. ‘సింహా’ తీసిన పరుచూరి ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాతో పాటు రామ్ మరో రెండు కథలకు ఓకే చెప్పారు. ఇకపై విరామం లేకుండా వరుసగా సినిమాలు చేసే యోచనలో ఉన్నారాయన. ఎనిమిదేళ్ల కెరీర్లో రామ్ పది సినిమాలు చేశారు. హైవోల్టేజ్ యాక్షన్ పాత్రలతో వినోదాన్ని కూడా బాగా పండిస్తారన్న ఇమేజ్ రామ్‌కి ఉంది. చాలా తక్కువ సమయంలోనే చిచ్చర పిడుగులా యూత్‌లోకి చొచ్చుకుపోయారు. యువతరంలోనూ, మాస్‌లోనూ తనకున్న ఇమేజ్‌ని నిలబెట్టుకుంటూనే కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దిశగా రామ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘పండగ చేస్కో’ ఆ నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమాపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పండగ చేసుకునే స్థాయిలో ఉంటుందని రామ్ నమ్మకం. -
హన్సిక అవుట్... రకుల్ ఇన్!
ఒకరికి చేదు వార్త... మరొకరికి తీపి వార్త. చేదువార్త హన్సికదైతే, తీపి వార్త రకుల్ ప్రీత్‌సింగ్‌ది. రామ్ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పండగ చేస్కో’ చిత్రంలో హన్సికను కథానాయికగా అనుకున్నారు. రామ్-హన్సిక అంతకుముందు మస్కా, కందిరీగ చిత్రాల్లో కలిసి చేశారు. హన్సిక తమిళంలో బిజీ కావడంతో ‘పండగ చేస్కో’కి డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందట. దాంతో ఆ అవకాశం రకుల్‌కి దక్కింది. ఇప్పటికే గోపీచంద్ పక్కన ఓ సినిమా చేస్తోన్న రకుల్... రామ్ పక్కన నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. ‘పండగ చేస్కో’ చిత్రం ఈ నెల 17న ప్రారంభం కానుంది.