
కాటమరాయుడు టీజర్ రిలీజ్ మళ్లీ వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా ఇంత వరకు సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు.
న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగినా.. కేవలం మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు చిత్రయూనిట్. ఆ తరువాత సంక్రాంతి కానుకగా తొలి టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి టీజర్ లాంచ్ వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. అభిమానులు నిరాశపడకుండా సంక్రాంతి రోజు మరో మోషన్ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నారు.