ఫుల్‌ స్టిల్‌ ఆ రోజే! | Still full of that same day! | Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్టిల్‌ ఆ రోజే!

Published Wed, Dec 28 2016 11:04 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

ఫుల్‌ స్టిల్‌ ఆ రోజే! - Sakshi

ఫుల్‌ స్టిల్‌ ఆ రోజే!

తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులకు డిసెంబర్‌ 31న కొత్త ఏడాది కానుక ఇవ్వడానికి పవన్‌కల్యాణ్‌ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్‌ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్‌ 31 అర్ధరాత్రి విడుదల చేయనున్నారు.

తమిళ హిట్‌ ‘వీరమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌ ప్రీ–లుక్‌ పోస్టర్‌గా మీరు చూస్తున్న స్టిల్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో పంచెకట్టులో ఉన్న పవన్‌ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి, ఫుల్‌ ఫొటో ఎక్కడనుకుంటున్నారా? ఈ 31న ఫుల్‌ స్టిల్‌ రిలీజ్‌ చేస్తారట! శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement