
కాటమరాయుడిలో పవన్ కల్యాణ్‌తో ఎద్దు (ఫైల్)
ఘంటసాలపాలెం(ఘంటసాల) : కాటమరాయుడు సినిమాలో నటించిన ఎద్దు గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాల గ్రామానికి చెందిన ఎన్నారై గొర్రెపాటి నవనీతకృష్ణ 2014లో రెండు ఎద్దులను కొని ఘంటసాలపాలేనికి చెందిన వేమూరి రాంబాబు ఆధ్వర్యంలో పెంచుతున్నారు.
ఈ ఎద్దులు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎద్దుల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాయి. అంతేకాక కాటమరాయుడు సినిమాలో నటించడంతో వీటి ప్రాచుర్యం మరింత పెరిగింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఎద్దు గురువారం మరణించడంతో రైతులు తీవ్ర మనస్థాపం చెందారు. అంతే కాక ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ఎద్దు కాటమరాయుడు సినిమాతో పాటు సావిత్ర సీరియల్‌లో కూడా నటించింది. చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మూడు షెడ్యూల్ షూటింగ్‌లో కూడా పని చేసినట్లు రాంబాబు వివరించారు.

ఎద్దు అంతిమయాత్ర
Comments
Please login to add a commentAdd a comment