సంక్రాంతికి పవన్ కూడా..! | Pawan Kalyan Katamarayudu Teaser Release on Sankranthi | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి పవన్ కూడా..!

Published Tue, Jan 10 2017 1:39 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సంక్రాంతికి పవన్ కూడా..! - Sakshi

సంక్రాంతికి పవన్ కూడా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

న్యూ ఇయర్కే టీజర్ను రిలీజ్ చేస్తారని భావించినా.. అప్పుడు మోషన్ పోస్టర్తో మాత్రమే సరిపెట్టేశారు. జనవరి 14 సంక్రాంతి రోజు సాయంత్రం 7 గంటలకు కాటమరాయుడు టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాక్షనిస్ట్గా కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement