న్యూ లుక్‌ కిక్కే వేరప్పా! | Pawan Kalyan Katamarayudu Teaser will be released on Sankranthi. | Sakshi
Sakshi News home page

న్యూ లుక్‌ కిక్కే వేరప్పా!

Published Sun, Jan 1 2017 12:43 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

న్యూ లుక్‌ కిక్కే వేరప్పా! - Sakshi

న్యూ లుక్‌ కిక్కే వేరప్పా!

కోర మీసం.. ఖద్దరు చొక్కా.. వేలికి బంగారపు ఉంగరం.. చూపుల్లో పౌరుషం... ‘కాటమరాయుడు’లో పవన్‌కల్యాణ్‌ లుక్‌ అభిమానులకు కిక్‌ ఇచ్చింది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్‌ లుక్‌ ఎలా ఉంటుందో చూడాలనుకునే వాళ్లను ఈ నెల 28 నుంచి సగం... సగం స్టిల్స్‌తో ఊరిస్తూ వచ్చిన చిత్ర బృందం శుక్రవారం రాత్రి ‘కాటమరాయుడు’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. కిశోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

‘‘ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతోంది. సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఉగాది కానుకగా సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు శరత్‌ మరార్‌. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement