వీరాభిమానికే కాటమరాయుడు రైట్స్ | Nithin Bags Katamarayudu Nizam rights | Sakshi
Sakshi News home page

వీరాభిమానికే కాటమరాయుడు రైట్స్

Published Sat, Feb 11 2017 3:34 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

వీరాభిమానికే కాటమరాయుడు రైట్స్ - Sakshi

వీరాభిమానికే కాటమరాయుడు రైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైపోయింది. పవన్ స్టామినాకు తగ్గట్టుగా ప్రతీ ఏరియా నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా మెగా హీరోలకు మంచి పట్టున్న నైజాం ఏరియాలో కాటమరాయుడు ఫైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. ఈ కాంపిటీషన్లో కూడా పవన్ తన అభిమానికే అవకాశం ఇచ్చాడు. యంగ్ హీరో నితిన్, పవన్కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోనే కాదు. పబ్లిక్ ఫంక్షన్స్లోనూ పవన్ జపం చేసే నితిన్.., కాటమరాయుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏషియన్ మూవీస్తో కలిసి సొంతం చేసుకున్నాడు.

పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ కుమార్ పార్థసాని) దర్శకుడు. పవన్ మిత్రుడు శరత్ మరార్..నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కాటమరాయుడును ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement