మరోసారి పండుగ బరిలో శర్వానంద్
వరుసగా తెలుగు పండుగలను టార్గెట్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధిస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇప్పటికే వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో టాప్ స్టార్ అనిపించుకున్న శర్వానంద్ మరోసారి పండుగ బరిలో సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 2016 సంక్రాంతికి ఎక్స్ప్రెస్ రాజాగా వచ్చిన శర్వ.. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్లు బరిలో ఉన్నా మంచి విజయం సాధించాడు.
అదే ఫీట్ రిపీట్ చేస్తూ 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణలు పోటి పడుతున్న సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘనవిజయం సాధించాడు. అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధ సినిమాను ఈ ఉగాది బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఉగాది వారం రోజుల ముందు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ అవుతున్నా.. పోటికే సై అంటున్నాడు. మరి శర్వ నమ్మకం మరోసారి నిజమౌతుందేమో చూడాలి.