కాంబినేషన్ కుదిరిందా?
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి... ఇలా మూడు వరుస విజయాలతో శర్వానంద్ హ్యాట్రిక్ సాధించారు. ‘మినిమమ్ గ్యారంటీ’ హీరో అనే పేరు సంపాదించుకున్న శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘రాధ’ 12న విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఇది కాకుండా దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారన్నది తాజా సమాచారం.
సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్... ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసే చిత్రాలను తెరకెక్కించిన దశరథ్... ఇప్పుడు శర్వానంద్‌తో ఓ మంచి లవ్‌స్టోరీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ కాంబినేషన్ నిజంగానే కుదిరిందా? లేదా? అన్నది మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, అన్నీ కుదిరితే టెన్ డేస్ తర్వాత అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట.