
లీకైన కాటమరాయుడు ఫైట్ సీన్
టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సీన్స్ కూడా ఆన్ లైన్లో రిలీజ్కు ముందే దర్శనమిచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పూర్తి సినిమాలు కూడా రిలీజ్కు ముందే ఆన్ లైన్లో ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా యాక్షన్ సీన్ ఒకటి ఆన్ లైన్లో దర్శనమిచ్చింది.
ఈ సీన్ సినిమా ఇంటర్వేల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్కు సంబందించినదన్న ప్రచారం జరుగుతోంది. రైల్వే స్టేషన్లో షూటింగ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్లో పవన్ ఫైట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. అదే సమయంలో క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఎక్కువగా ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతుండగా పలు సందర్భాల్లో యూని సభ్యులే లీకులిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.