
పవన్.. రెండేళ్లలో నాలుగు సినిమాలు చేస్తాడట..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత కాస్త ఆలస్యంగా కాటమరాయుడు సినిమాను మొదలు పెట్టిన పవన్, జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2017 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు పవన్.
అంతేకాదు 2019 ఎన్నికల్లో పోటి చేయాలని భావిస్తున్న పవర్ స్టార్, ఈ లోగా నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. కాటమరాయుడు తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి అదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ తరువాత 2018లో మరో రెండు సినిమాలు రిలీజ్ చేసి తరువాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడు.