పవన్ తమ్ముళ్లు వీళ్లే..! | Brothers of pawan kalyan for katamarayudu confirmed | Sakshi
Sakshi News home page

పవన్ తమ్ముళ్లు వీళ్లే..!

Published Fri, Sep 30 2016 10:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ తమ్ముళ్లు వీళ్లే..! - Sakshi

పవన్ తమ్ముళ్లు వీళ్లే..!

సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్రలకు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేశాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు. అయితే ఈ పాత్రల్లో ఎవరు కనిపించనున్నారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.

ఫైనల్గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే గబ్బర్సింగ్ సినిమాలో పవన్ సోదరుడిగా నటించిన అజయ్ ఒక తమ్ముడిగా నటిస్తుండగా, కమల్ కామరాజు, శివబాలజీలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement