నేను ఎప్పుడో చనిపోయా : వర్మ | ram gopal Varma Comments on Pawan Kalyan Fans | Sakshi
Sakshi News home page

నేను ఎప్పుడో చనిపోయా : వర్మ

Published Tue, Mar 28 2017 12:38 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నేను ఎప్పుడో చనిపోయా : వర్మ - Sakshi

నేను ఎప్పుడో చనిపోయా : వర్మ

కాటమరాయుడు సినిమా రిలీజ్ తరువాత మరోసారి ట్విట్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. కాటమరాయుడు సినిమా రిజల్ట్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని కూడా తనదైన స్టైల్ లో కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మపై పవన్ అభిమానలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. 'హటాత్తుగా మరణించిన రామ్ గోపాల్ వర్మ. సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు.. ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం' అనీ రాసున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ ప్రచారం స్పందించిన వర్మ, మరోసారి తన మార్క్ ట్వీట్లతో పవన్ అభిమానులకు చురకలంటించాడు. 'లవ్ యు మై డియర్ స్వీట్ డార్లింగ్‌ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పీకే ఫ్యాన్స్. మీ అందరికీ నా బిగ్ హగ్' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు.. పవన్ ఫ్యాన్స్ ను గొర్రెలన్న వర్మ, 'నేను మూడు జన్మల ముందే చనిపోయాను. ప్రస్తుతం ఇక్కడ బతికున్న నేను దెయ్యాన్ని, దెయ్యాలు చనిపోవు, అవెప్పుడు చావులో బతికే ఉంటాయి అంటూ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ల పై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement