పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు | telangana minister ktr Appreciates pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు

Published Sun, Mar 26 2017 3:44 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు - Sakshi

పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, కాటమరాయుడు సినిమా నిర్మాత శరత్‌ మరార్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. పవన్ తాజా సినిమా కాటమరాయుడును చూసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ద్వారా చేనేత వస్త్రాలకు బాగా ప్రాచుర్యం కల్పించారని ప్రశంసించారు. పవన్‌తో కలిసున్న ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరూ ఎప్పుడు కలిశారన్న విషయం తెలియరాలేదు. కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ శరత్‌ మరార్ రిప్లై ఇచ్చారు.

కాటమరాయుడు సినిమాలో పవన్ పంచెకట్టు, ఖద్దరు దుస్తులతో కనిపిస్తారు. అంతేగాక చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటానని ఇటీవల పవన్ ప్రకటించారు. కేటీఆర్ కూడా తెలంగాణలో చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ నటి సమంతను చేనేత ప్రచారకర్తగా నియమించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement