telangana minister ktr
-
ప్రీతి ఘటనపై స్పందించిన కేటీఆర్.. 'తప్పు చేసినవారు ఎవరైనా వదలం'
సాక్షి, వరంగల్: ప్రీతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తప్పుచేసినవారు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ప్రీతి ఎపిసోడ్‌పై స్పందిస్తూ ఈమేరకు మాట్లాడారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆమె ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి ఎపిసోడ్‌పై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. కేటీఆర్‌కు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఏపీ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నా.. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏపీలో సంక్షేమ పాలన దేశానికే ఆదర్శమన్నారు. సీఎం జగన్ పాలనలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్ -
పవన్ కల్యాణ్‌కు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, కాటమరాయుడు సినిమా నిర్మాత శరత్ మరార్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. పవన్ తాజా సినిమా కాటమరాయుడును చూసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ద్వారా చేనేత వస్త్రాలకు బాగా ప్రాచుర్యం కల్పించారని ప్రశంసించారు. పవన్‌తో కలిసున్న ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరూ ఎప్పుడు కలిశారన్న విషయం తెలియరాలేదు. కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ శరత్ మరార్ రిప్లై ఇచ్చారు. కాటమరాయుడు సినిమాలో పవన్ పంచెకట్టు, ఖద్దరు దుస్తులతో కనిపిస్తారు. అంతేగాక చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ఇటీవల పవన్ ప్రకటించారు. కేటీఆర్ కూడా తెలంగాణలో చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ నటి సమంతను చేనేత ప్రచారకర్తగా నియమించింది. Watched @PawanKalyan KatamaRayudu. You have a sure winner Kalyan & @sharrath_marar Appreciate the subtle but strong promotion of Handlooms -
రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ..
న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసింది. హైదరాబాద్ లో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరింది. హోం మంత్రి నివాసానికి వెళ్లిన కేటీఆర్ బృందం.. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించతలపెట్టిన రసూల్ పురా జంక్షన్ కు ఆటంకాలు తొలగించాలని వినతిపత్రం అందించింది. కేటీఆర్ నేతృత్వంలోని బృందంలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ రోజంతా ఢిల్లీలోనే గడపనున్న కేటీఆర్.. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హాలతోనూ భేటీ కానున్నారు. భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్ ను కూడా సందర్శించనున్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సోమవారం జర్నలిస్టు సంఘాల నేతలు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు సంబంధించి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్లకు సంబంధించి ఈనెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యభీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది
రామాయంపేట (మెదక్) : వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలసి రామాయంపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు.