రాజ్‌నాథ్తో కేటీఆర్‌ భేటీ.. | Telangana minister KTR met MoHA rajnathsingh | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్తో కేటీఆర్‌ భేటీ..

Published Mon, Nov 21 2016 11:56 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

రాజ్‌నాథ్తో కేటీఆర్‌ భేటీ..

రాజ్‌నాథ్తో కేటీఆర్‌ భేటీ..

న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసింది. హైదరాబాద్‌ లో రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరింది. హోం మంత్రి నివాసానికి వెళ్లిన కేటీఆర్‌ బృందం.. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించతలపెట్టిన రసూల్‌ పురా జంక్షన్ కు ఆటంకాలు తొలగించాలని వినతిపత్రం అందించింది.

కేటీఆర్ నేతృత్వంలోని బృందంలో సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. ఈ రోజంతా ఢిల్లీలోనే గడపనున్న కేటీఆర్.. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హాలతోనూ భేటీ కానున్నారు. భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ ను కూడా సందర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement