
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఏపీ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నా.. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏపీలో సంక్షేమ పాలన దేశానికే ఆదర్శమన్నారు. సీఎం జగన్ పాలనలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని మంత్రి రోజా అన్నారు.
చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment