షూటింగ్‌లో ప్రమాదం.. హీరోకు గాయాలు | Vicky Kaushal Meets With An Accident While Shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ప్రమాదం.. హీరోకు గాయాలు

Published Sat, Apr 20 2019 11:59 AM | Last Updated on Sat, Apr 20 2019 12:01 PM

Vicky Kaushal Meets With An Accident While Shooting - Sakshi

‘యురి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఓ గుజరాతీ సినిమాలో నటిస్తున్న విక్కీ ఆ సినిమా షూటింగ్‌లో గాయాల పాలయ్యాడు. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అనుకోకుండా ఓ భారీ డోర్‌ మీద పడటంతో విక్కీ గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో విక్కీ దవడ ఎముక విరిగింది. దగ్గరలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తరువాత ఆయన్ను ముంబైకి తీసుకెళ్లారు. ప్రముఖ బాలీవుడ్‌ ఎనలిస్ట్‌ తరణ్ ఆదర్శ్‌ ఈ విషయన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. విక్కీ కౌశల్‌కు పదమూడు కుట్లు పడినట్టుగా ఆయన తెలిపారు. భాను ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుజరాతీ హారర్ మూవీ చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement