ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాలంటే కంటెంట్ తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాల్లో హీరో స్టార్ డమ్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం చూస్తుంటాం. మరికొన్ని సార్లు చిన్న సినిమా అయినా సరే కంటెంట్ వల్ల కాసుల వర్షం కురవాల్సిందే. కేవలం భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడమే కాదు.. కథ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. అలా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు చాలా తక్కువే ఉన్నాయి. వాటిలో దంగల్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, బాహుబలి-2, పఠాన్ అత్యధిక వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
(ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా?)
కానీ తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు కూడా చాలా తక్కువే. అందులో మొదట వినిపించే పేరు యూరి: ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఊహించని బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. 2019లో వచ్చిన ఈ చిత్రం.. భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కథాంశంగా తెరకెక్కించారు. ఈ మూవీతో ఆదిత్య ధర్ దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. విక్కీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌లో వార్, కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్కీ కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
(ఇది చదవండి: ఇప్పుడు సౌత్‌పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !)
విక్కీ మాట్లాడుతూ.. 'నేను మొదట ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత నటనలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. అప్పట్లో ఓ ప్రొడక్షన్ కంపెనీలో ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా మొదటి వేతనం నెలకు కేవలం రూ.1500 రూపాయలే. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది. బాంద్రా స్టేషన్‌లో కూర్చుని విక్కీ కౌశల్ అని ముద్రించిన రూ. 1,500 చెక్కును అలా చూస్తునే ఉన్నా.' అని చెప్పారు. ఇటీవలే జరా హాట్కే జరా బచ్కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్ జంటగా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment