దశాబ్దకాలంగా బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీనియర్ నటుడు నవ్‌తేజ్ హుండల్ సోమవారం సాయంత్రం ముంబైలో మృతిచెందారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన వార్ డ్రామా ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో హోం మినిస్టర్ పాత్రలో నటించారు నవ్‌తేజ్.
సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. నవ్‌తేజ్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కూతురు అవంతిక హుండల్ పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. నటించటం మాత్రమే కాదు నవ్‌తేజ్ నటనలో శిక్షణ కూడా ఇస్తుంటారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment