
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాల టికెట్ ధరను రూ.50కి పెంచినట్టు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.20 ఉండగా రూ.50కి పెంచుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. పెంచిన ధర శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఈవో పేర్కొన్నారు. పెంచిన రూ.50 టికెట్ ధరలో 60 శాతం నాయీ బ్రాహ్మణులకు, 40 శాతం సొమ్ము దేవస్థానానికి చెందనుందని వివరించారు.