ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం
రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్‌ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. - సాక్షి, ఒంగోలు
ఆన్‌లైన్ విధానంలో
ట్రైన్ పేరు, ట్రైన్ నంబరు కోసం...
టీఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ పేరు లేక ట్రైన్ నంబరు ఎంటర్ చేయండి.
ఉదా: TN <TRIAN NAME> OR TN <TRIAN NUMBER>
ఆ పేరున ఉన్న అన్ని ట్రైన్ల నంబర్లు, ట్రైన్ల పేరు మీ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది.
టికెట్ ధర తెలుసుకోవాలంటే...
ఫేర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ ప్రయాణం తేదీ, నెల, సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్‌టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్‌టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి.
ఉదా: FARE <TRIAN NUMBER> <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA>
ఇక్కడ మీకు ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అన్ని తరగతులు ధరలు కనిపిస్తాయి.
ట్రైన్ టైమ్ టేబుల్ కావాలంటే...
టైమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు ఎంటర్ చేయాలి.
ఉదా: TIME <TRIAN NUMBER>
ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి బయలు దేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వారంలో ఎన్ని సార్లు అందుబాటులో ఉంటుంది, ఏ తరగతులు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలు మీకు తెలుస్తాయి.
ట్రైన్లో సీట్ ఉందా లేదా,
వెయిటింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే..
సీట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబర్ స్పేస్ ప్రయాణం తేదీ నెల సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్‌టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్‌టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి.
ఉదా: EAT <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA>
ఇక్కడ మీకు అన్ని తరగతులలో అందుబాటులో ఉన్న వివరాలు, వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది.
ట్రైన్ రాకపోకల సమయం కోసం
ఎడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ స్టేషన్ ఎస్‌టీడీ కోడ్ ఎంటర్ చేయాలి.
ఉదా: AD <TRIAN NUMBER> <STATION STD CODE'>
మీరు తెలుసుకోవాలనుకున్న ట్రైన్ టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు.
పీఎన్‌ఆర్ ఎంక్వైరీ కోసం..
పీఎన్‌ఆర్ స్పేస్ ఇచ్చి పది సంఖ్యల పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి.
ఉదా: PNR <PNR TEN DIGIT NUMBER>
మీరు రిజర్వ్ చేసుకున్న టికెట్ స్టేటస్ తెలుస్తుంది.