
పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన నూతన ధరల సూచిక
అనంతగిరి(అరకులోయ): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు ప్రవేశాల టికెట్ ధరల్లో పర్యాటక శాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం అమలవుతున్న ధరల కాస్త మార్చుతూ బుధవారం నుంచి నూతన ధరలను అందుబాటులోకి తేనుంది. ప్రసుత్తం పెద్దలకు రూ.60, చిన్న పిల్లలకు రూ.45, వీడియో కెమెరాకు రూ.100, సెల్‌ఫోన్‌కు రూ.25 టిక్కెట్ ధర ఉండేది. వీటిని మారుస్తూ పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 50 చేశారు. వీడియె కెమెరాకు గతంలో ఉన్న రూ.100 నే ఉంచగా, సెల్‌ఫోన్‌కు టికెట్ ధర రద్దుచేస్తూ పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు 23 నుంచి అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment