
సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైపోయింది. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే టికెట్ రేట్ల పెంపుపై ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించేసింది. అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 వరకు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. అలానే ఈనెల 12 నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపు కోసం వెసులుబాటు కల్పించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
ఇక తెలంగాణ విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంపు ఇచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి అనుమతి లభించిన దృష్ట్యా ఆంధ్రాలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి.
సినిమా విషయానికొస్తే.. మాస్-ఫ్యామిలీ-కమర్షియల్ ఎలిమెంట్స్‌తో 'గుంటూరు కారం' తీశారు. మహేశ్‌కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. చినబాబు నిర్మాతగా వ్యవహరించారు.
(ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment