
కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కమిటీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. కొంత కాలంగా రాష్ట్ర కమిటీ నియామకంపై పార్టీలో ఎదురుచూపులు సాగుతుండగా, ఎట్టకేలకు శనివారం ప్రకటించారు. మొత్తం 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 14 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారితో పాటు పదిమంది జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.
ఉపాధ్యక్షులుగా కందుల రాజమోహన్ రెడ్డి, దర సాంబయ్య, పాక సత్యనారాయణ, దశరథ రాజ్ కవిత, ఎస్ విష్ణువర్థన్ రెడ్డి, తురగ నాగభూషణం, కే కపిలేశ్వరయ్య, కే కోటేశ్వరరావులు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా వి సత్యమూర్తి, జమ్ముల శ్యాం కిషోర్, ఎస్ సురేష్ రెడ్డి, పీ మాణిక్యాల రావు, కోశాధికారిగా పీ సన్యాసి రాజు నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వీరితో పాటు మరికొంత మందికి కమిటీలో చోటు కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment