
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో టీడీపీ ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటుచేసుకుంది. అనంతరం తోపులాట చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment