
బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించి ఆయన బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి బాటలోనే కన్నా పయనించి కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. దేశమంతా నరేంద్ర హవా కొనసాగుతుండడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.