
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం సోము వీర్రాజు స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. దశాబ్దాలుగా సంఘ్ పరివార్‌లో కొనసాగారు. గతంలోనే సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి.. చేతికి అందినట్టే అంది చేజారింది. ప్రస్తుతం ఆయన ఏపీ మండలిలో సభ్యునిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment