
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు కొందరు వీర్రాజును జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్భంధించారు.
భారత జనతాపార్టీ ఎమ్మెల్యే సీట‍్ల కేటాయింపులో బీజేపీ నేతలు వివక్షత చూపుతున్నారని బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పని చేసే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులను ఎవరిని జిల్లాలో అడుగు పెట్టనీయబోమని అన్నారు. రానున్నరోజుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణను కూడా ఇదే విధంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment