కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్? | Vijayasai Reddy Fires On Kanna Laxminarayana | Sakshi
Sakshi News home page

కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?

Published Wed, Apr 22 2020 12:33 PM | Last Updated on Wed, Apr 22 2020 2:02 PM

Vijayasai Reddy Fires On Kanna Laxminarayana - Sakshi

సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ కన్నా విసిరిన సవాలుపై స్పందిస్తూ.. తాను దేవుడిపై ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కన్నా, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిలు కూడా ప్రమాణం​ చేస్తారా అని నిలదీశారు. తాజాగా కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్‌ అంటూ కన్నా లక్ష్మీ నారాయణను విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 

అలాగే కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ. 30 కోట్లు నొక్కేశాడని ఎన్నికల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. స్థానికంగా సమీకరించిన విరాళాలు కూడా దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు అందాయని తెలిపారు. కన్నాతో పాటుగా కొత్తగా చేరిన నేతలు.. ఈ నిధులను పంచుకున్నట్టు బీజేపీ పెద్దలకు తెలుసునని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చీమ కుడితే.. బీజేపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి.ఎప్పుడు ఏ విధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్‌ ఇస్తుంది’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. 

చదవండి : ‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement