సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక దిగజారిన ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని, ఆర్టీవో అధికారులతో కలిసి సభకు వచ్చే బస్సు యజమానులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్‌కు కూడా కలిశామని చెప్పారు. ‘మోదీ సభను అడ్డుకోండి, నరకండి, చంపండి అని చంద్రబాబు తన గూండాలకు చెప్తున్నారు. ఇంతలా దిగజారిన సీఎంను ఇక్కడే చూస్తున్నాం’ అని మీడియాతో అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మోదీకి ఎంట్రీ లేదంటూ టీడీపీ నేతలు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వచ్చే మార్గంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment