
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే చంద్రబాబుకి భయం పట్టుకుందనీ, తన నీడను చూసుకుని కూడా చంద్రబాబు భయపడుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారనే ఎప్పుడో చెప్పామని అన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు అవసరం కొద్ది పొత్తులు పెట్టుకుంటారని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
బీజేపీకి కులం, మతం, రంగు లేదని ఉద్ఘాటించారు. కమ్యూనిస్టుల చరిత్రంతా విదేశీయులదేనని విమర్శలు గుప్పించారు. కోర్టు నోటీసులను బేఖాతరు చేస్తున్న చంద్రబాబు న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రచార దాహంతోనే 29 మంది మృతి చెందారనీ, గోదావరి పుష్కారాల్లో తొక్కిసలాటకు ఆయనే కారణమని ఆరోపించారు. ప్రమాద ఘటన పై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ముఖ్యమంత్రికి ధైర్యముంటే పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన, విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment