సాక్షి,హైదరాబాద్: సోమవారం నుంచి గురువారం వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు కార్యక్రమాల వివరాలు నిర్వాహకుల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి..
నవంబర్ 4న: ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత నగర శివార్లలో స్థానిక వ్యవసాయ పద్ధతుల పరిశీలన, నగరంలోని వివిధ వ్యవసాయ, అనుబంధ పరిశోధనా కేంద్రాల సందర్శన
- రాత్రి 7 గంటలకు నొవాటెల్ హోటల్‌లో వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చే విందుకు హాజరు.
నవంబర్ 5న: సదస్సు ప్రారంభోత్సవం: ఉదయం 9.30 - 11 గంటల మధ్య
- మ. 2 నుంచి 1 గంటల వరకు: ఆర్బీ సింగ్ (మాజీ డెరైక్టర్, ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్), లియాన్ కండాన్ (సీఈవో, బేయర్ కంపెనీ), అనిల్ జైన్(సీఈవో, జైన్ ఇరిగేషన్)ల కీలకోపన్యాసాలు
- సా. 2.30 నుంచి 4 గంటల వరకు: ప్రొ. జులియన్ క్రిబ్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ, ఆస్ట్రేలియా), డెన్సీ బ్యురెల్ (గ్లోబల్ ఫాం ఎక్సెటెన్షన్ మేనేజర్), సుహాస్ పి. వాణి(ఇక్రిశాట్)ల ఉపన్యాసాలు
- సా. 4 నుంచి 5 గంటల మధ్య: ‘పార్టనరింగ్ సొల్యూషన్స్ ఫర్ స్మాల్‌హోల్డర్ ఫ్రార్మర్స్’ అనే అంశంపై బేయర్ కంపెనీ ఆధ్వర్యంలో చర్చ.
- సా. 5 నుంచి 6 గంటల వరకు: ‘సుస్థిర వ్యవసాయంలో సహకార సంఘాల పాత్ర’అనే అంశంపై ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి ఆధ్వర్యంలో.. ‘భారత దేశంలో ఆహార, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో చర్చా గోష్టులు
రాత్రి 7.30 గంటలకు: శిల్పారామంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆతిధ్యంలో విందు.
నవంబర్ 6న: ఉ. 9.30 గంటలకు: కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బెరై గౌడ కీలకోపన్యాసం. ఠ ఉ. 10 నుంచి 11 గంటల వరకు: పాడి రంగంపై చర్చ
- ఉ. 11 గంటలకు: పర్యావరణానికి మేలు చేస్తున్న ‘బయోబేస్డ్’ వ్యవసాయంపై పెర్ ఫాల్‌హట్ (డెన్మార్క్), అన్‌టన్ రొబెక్(బయోబేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అధ్యక్షుడు) ఉపన్యాసాలు
- మ. 12.30 గంటలకు: వాణిజ్య ప్రదర్శన అంశంపై అరుణ్ చంద్ర అంబటిపూడి(ఫెయిర్ ట్రేడ్ ఫౌండేషన్ ఇండియా, ఈడీ) ఉపన్యాసం
- మ. 2.30 గంటలకు: అమరీష్ గులాటి (ఎండి, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్), థాడ్ సిమన్స్(సీఈవో, నొవస్ ఇంటర్నేషనల్)ల ఉపన్యాసాలు. ఆ తర్వాత వ్యవసాయంలో మౌలిక వసతులు, రవాణా తదితర అంశాలపై చర్చ.
- సా. 4.30 గంటలకు: డెవలపింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ అగ్రి బిజినెస్, రిస్క్ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రి బిజినెస్ అంశాలపై వ్యవసాయ సదస్సు చైర్మన్ కెన్నత్ బేకర్ ఆధ్వర్యంలో చర్చ
నవంబర్ 7న: ఉ. 9.30 గంటలకు: సుస్థిర వ్యవసాయంలో ముల్కనూరు సొసైటీ విజయగాథపై ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రసంగం ఠ ఉ. 10 నుంచి 12.45 గంటల వరకు: టెక్నాలజీ రెస్పాండింగ్ టు నేచర్స్ ఛాలెంజెస్ అన్న అంశంపై ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో చర్చ.. వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులపై చర్చ ఠ మ. 1.45 గంటలకు: సదస్సు ముగింపు సభ.
ప్రపంచ వ్యవసాయ సదస్సు జరిగేదిలా
Published Mon, Nov 4 2013 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement