world agricultural forum
-
సేద్యం ఎలా చేయాలంటే...
ప్రపంచ వ్యవసాయ సదస్సుకి చంద్రబాబుని ముఖ్య అతిథిగా పిలిచారు. ‘‘వ్యవసాయం వల్ల ప్రపంచంలోని రైతులంతా పాపర్ పడుతుంటే, రెండెకరాల నుంచి వేలకోట్లకు బాబు ఎదిగాడు. సేద్యంలో ఎన్నో మెలకువలు తెలిసుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ టెక్నిక్‌లు వివరిస్తే రైతులంతా బాగుపడతారు’’ అని నిర్వాహకులు చెప్పారు. బాబు మైక్ తీసుకుని, ‘‘సేద్యానికి వైద్యం అవసరం, నైవేద్యం దైవానికి ముఖ్యం. గుడిని లింగాన్ని మింగినా బయట బసవన్న మిగిలిపోతాడు. అవార్డుల్లో నంది మిగిలింది. పొలాల్లో మాయమైంది. భూమిని ఒక్కోచోట ఒక్కోరకంగా పిలుస్తారు. కుంటలు ఎకరాలవుతాయి. గజాలు అపార్ట్మెంట్లవుతాయి. సెంట్లు పర్సెంటేజీగా మారుతాయి. రైతు ఎండినపుడు ఇజ్రాయిల్నుంచి పనిముట్లు తెప్పించాను. పొలం పండినపుడు దివాళా తీయించాను. మట్టిని నమ్మితే పుట్టి మునుగుతుంది. ల్యాండ్‌ని అమ్మితే బ్యాండ్ మోగుతుంది...’’ అని చెపుతుండగా నిర్వాహకులు అడ్డుతగిలి, ‘‘సార్, మేమడిగింది రెండెకరాల వల్ల మీరెలా బాగుపడ్డారని...’’ అని అడిగారు. ‘‘చెడిపోయేవాడిని ఎవరూ బాగు చేయలేరు. బాగుపడేవాడిని ఎవరూ చెడగొట్టలేరు. మనది కర్మభూమి. ప్రజలకు ఖర్మ మిగిలి మనకు భూమి మిగులుతుంది. రాజకీయాలను వ్యవసాయంతో అనుసంధానం చేసి, వచ్చిన మిగులును భూమితో బంధించి, ఆ తరువాత పాలిటిక్స్‌ని దున్ని, ఎన్నికల్లో విత్తులు చల్లి, ఓట్లను కోసుకుని వచ్చిన పంటను దాచి, కరువొచ్చినపుడు వ్యాపారం చేసి... రైతన్న రాజ్యంలో...’’ అని బాబు అంటుంటే... నిర్వాహకులు బుర్రగోక్కొని, ‘‘సార్, ట్రాక్ తప్పుతున్నారు...’’ అన్నారు. ‘‘ట్రాక్ వుంటే కదా తప్పడానికి! రైలుకి ట్రాక్, బస్సుకి రోడ్డు, నౌకకి నీళ్లు, విమానానికి ఆకాశం.. మరి రైతుకి? భూమిలోకి దిగితే బురద, ఒడ్డుకొస్తే అప్పులు, అందుకే సేద్యం దండగ. క్రాక్ ఉంటేనే ట్రాక్ తప్పుతాం.’’ నిర్వాహకులు జడుసుకొని వేదికపై నుంచి దూకడానికి ప్రయత్నించారు. బాబు వారిని ఒడిసి పట్టుకుని ‘‘అంతా మీ ఇష్టమేనా? అడిగినవారిని కడిగేస్తా, అవినీతిలేని సమాజం, పేదరికంలేని ప్రజలను చూడడమే ఆశయం. దీనికోసం రుణాలిస్తా, ఇచ్చినవాటిని మాఫీ చేస్తా. నన్నెవరేం చేయలేరు’’ అని అరిచాడు. ‘‘వ్యవసాయంపైన ఎలా సంపాదించానంటే ఎవరో పంట వేస్తే మనం కోసుకోవాలి. అదో పథకం. ఇక ఉదయం విత్తితే సాయంత్రం పంట పండేలా చూసుకోవాలి. దీన్ని గవర్నమెంట్ క్రాప్ అంటారు. ఎంతకోస్తే అంత పండుతుంది. మనకు కంకులు, జనానికి గడ్డి. ఇలా రాజకీయాల్లో ముప్ఫై ఏళ్లకు పైగా సేద్యం చేసి పంట పండించాను. నాకంటే ఉత్తమరైతు ఉంటాడా?’’ అని సవాల్ చేశాడు. ఇంతలో బాబు పీఏ వచ్చి, ‘‘ఆయన ఏదీ స్పష్టంగా మాట్లాడడు. మనకు ఎంత అర్థమైతే అంత, ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోవాలి. సముద్రం చూడ్డానికే తప్ప తాగడానికి పనికిరాదు’’ అని విడమరిచి చెప్పేసరికి నిర్వాహకులు, రైతులు కలిసికట్టుగా పారిపోయారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం రాజకీయ పేకాటలో ఈసారి కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది? జోకర్లు ఎక్కువై! రేషన్ కార్డులు అడిగిన వారికి మెమొరీ కార్డులు, మెమొరీ కార్డులు అడిగిన వారికి రేషన్ కార్డులివ్వడమే రాజకీయం. స్పోర్ట్స్ సామెత: అన్ని బాల్స్‌ను ఒకే బ్యాట్‌తో కొట్టలేం! బాబుకి కిరణ్‌కి తేడా? బాబుని చూస్తే ప్రజలు భయపడతారు. ప్రజలను చూసి కిరణ్ భయపడతాడు. కేజ్రీవాల్ పరిస్థితి కుర్చీ కింద కాంగ్రెస్ టైంబాంబు పెట్టుకున్నాడు. ఢిల్లీ ఎన్నికలపై ఒక పెద్దాయన కామెంట్: ప్రజలు చీపుళ్లతో వూడ్చిన ప్రతిసారి అంతకు రెండింతలు చెత్తను వేస్తారు మన నాయకులు. టీకొట్టు వ్యాఖ్య: పులి వేషానికి, భరతనాట్యానికి తేడా తెలియకుండా ఎగురుతున్నారు మన నాయకులు. -
నేటి నుంచి ప్రపంచ వ్యవసాయ సదస్సు
-
ప్రపంచ వ్యవసాయ సదస్సు జరిగేదిలా
సాక్షి,హైదరాబాద్: సోమవారం నుంచి గురువారం వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు కార్యక్రమాల వివరాలు నిర్వాహకుల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి.. నవంబర్ 4న: ఉదయం 10.30 గంటలకు ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత నగర శివార్లలో స్థానిక వ్యవసాయ పద్ధతుల పరిశీలన, నగరంలోని వివిధ వ్యవసాయ, అనుబంధ పరిశోధనా కేంద్రాల సందర్శన - రాత్రి 7 గంటలకు నొవాటెల్ హోటల్లో వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చే విందుకు హాజరు. నవంబర్ 5న: సదస్సు ప్రారంభోత్సవం: ఉదయం 9.30 - 11 గంటల మధ్య - మ. 2 నుంచి 1 గంటల వరకు: ఆర్బీ సింగ్ (మాజీ డెరైక్టర్, ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్), లియాన్ కండాన్ (సీఈవో, బేయర్ కంపెనీ), అనిల్ జైన్(సీఈవో, జైన్ ఇరిగేషన్)ల కీలకోపన్యాసాలు - సా. 2.30 నుంచి 4 గంటల వరకు: ప్రొ. జులియన్ క్రిబ్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిడ్నీ, ఆస్ట్రేలియా), డెన్సీ బ్యురెల్ (గ్లోబల్ ఫాం ఎక్సెటెన్షన్ మేనేజర్), సుహాస్ పి. వాణి(ఇక్రిశాట్)ల ఉపన్యాసాలు - సా. 4 నుంచి 5 గంటల మధ్య: ‘పార్టనరింగ్ సొల్యూషన్స్ ఫర్ స్మాల్హోల్డర్ ఫ్రార్మర్స్’ అనే అంశంపై బేయర్ కంపెనీ ఆధ్వర్యంలో చర్చ. - సా. 5 నుంచి 6 గంటల వరకు: ‘సుస్థిర వ్యవసాయంలో సహకార సంఘాల పాత్ర’అనే అంశంపై ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి ఆధ్వర్యంలో.. ‘భారత దేశంలో ఆహార, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో చర్చా గోష్టులు రాత్రి 7.30 గంటలకు: శిల్పారామంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆతిధ్యంలో విందు. నవంబర్ 6న: ఉ. 9.30 గంటలకు: కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బెరై గౌడ కీలకోపన్యాసం. ఠ ఉ. 10 నుంచి 11 గంటల వరకు: పాడి రంగంపై చర్చ - ఉ. 11 గంటలకు: పర్యావరణానికి మేలు చేస్తున్న ‘బయోబేస్డ్’ వ్యవసాయంపై పెర్ ఫాల్హట్ (డెన్మార్క్), అన్టన్ రొబెక్(బయోబేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అధ్యక్షుడు) ఉపన్యాసాలు - మ. 12.30 గంటలకు: వాణిజ్య ప్రదర్శన అంశంపై అరుణ్ చంద్ర అంబటిపూడి(ఫెయిర్ ట్రేడ్ ఫౌండేషన్ ఇండియా, ఈడీ) ఉపన్యాసం - మ. 2.30 గంటలకు: అమరీష్ గులాటి (ఎండి, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్), థాడ్ సిమన్స్(సీఈవో, నొవస్ ఇంటర్నేషనల్)ల ఉపన్యాసాలు. ఆ తర్వాత వ్యవసాయంలో మౌలిక వసతులు, రవాణా తదితర అంశాలపై చర్చ. - సా. 4.30 గంటలకు: డెవలపింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ అగ్రి బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రి బిజినెస్ అంశాలపై వ్యవసాయ సదస్సు చైర్మన్ కెన్నత్ బేకర్ ఆధ్వర్యంలో చర్చ నవంబర్ 7న: ఉ. 9.30 గంటలకు: సుస్థిర వ్యవసాయంలో ముల్కనూరు సొసైటీ విజయగాథపై ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రసంగం ఠ ఉ. 10 నుంచి 12.45 గంటల వరకు: టెక్నాలజీ రెస్పాండింగ్ టు నేచర్స్ ఛాలెంజెస్ అన్న అంశంపై ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో చర్చ.. వ్యవసాయ మార్కెట్ల తీరుతెన్నులపై చర్చ ఠ మ. 1.45 గంటలకు: సదస్సు ముగింపు సభ. -
నేటి నుంచి ప్రపంచ వ్యవసాయ సదస్సు
రైతుల నిర్లిప్తత.. రైతు సంఘాల వ్యతిరేకత.. {పధాని, కేంద్ర వ్యవసాయ మంత్రీ రావడం లేదు విదేశీ ప్రతినిధుల నమోదు 10 శాతమే.. రుసుము తగ్గించినా ఫలితం శూన్యం ఆలస్యంగా ఆహ్వానాలు.. రాలేనన్న చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్ ఉపాధ్యక్షుడు ఐసీఏఆర్ డెరైక్టర్ డా. అయ్యప్పన్, డా.స్వామినాథన్‌ల పరిస్థితీ ఇదే సదస్సు ప్రాంగణంలో సందడి కోసమే జిల్లాల నుంచి రైతుల తరలింపు! సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ప్రపంచ వ్యవసాయ సదస్సు(డబ్ల్యూఏఎఫ్) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా హడావుడి చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం నిర్లిప్తంగానే ఉండిపోయారు. ఈ సదస్సును బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే నిర్వహిస్తున్నారు తప్ప మన దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు అన్ని రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ఆతిథ్యమిచ్చే అవకాశం మనకు దక్కడం ఎంతో ప్రతిష్టాత్మకమని.. ఇందులో చర్చలు, తీర్మానాలు ఇక్కడి సన్న, చిన్నకారు రైతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని నమ్మబలుకుతోంది. ఈ వాద వివాదాల మధ్య సోమవారం నుంచి నాలుగు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సుకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతోంది. తేలిపోయిన తొమ్మిది నెలల కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సుకు 9 నెలల క్రితం నుంచే సన్నాహాలు చేయనారంభించినా ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నిర్వాహకులు మొదట చెప్పినట్లు ప్రధాని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిల్‌గేట్స్ రావడం లేదు. చివరికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణే కార్యక్రమాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 350 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులే 350 మంది హాజరవుతారని తొలుత ప్రకటించారు. చివరకు వీరి సంఖ్య 33కు పరిమితమైంది. సభ్యత్వ నమోదు రుసుమును రూ.10,600 నుంచి రూ.5,000కు తగ్గించినప్పటికీ ప్రతినిధుల సంఖ్య పెరగలేదు. ప్రభుత్వం రుసుము చెల్లించి 25 మంది రైతు సంఘాల ప్రతినిధులు, 50 మంది ఆదర్శ రైతులను సదస్సుకు పంపుతోంది. వీరితో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగులు, విత్తనాలు, పురుగుమందుల కంపెనీల ప్రతినిధులు సదస్సులో ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. ఆలస్యంగా ఆహ్వానించినందున చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సెన్సైస్ ఉపాధ్యక్షుడు సదస్సుకు రావడం లేదు. ఇదే కారణంతో చివరికి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్) డెరైక్టర్ డా. అయ్యప్పన్, డా. ఎం.ఎస్. స్వామినాథన్ కూడా రావడం లేదని సమాచారం. ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో సదస్సు వద్ద ఏర్పాటయ్యే అగ్రి ట్రేడ్ ఫెయిర్‌కు రోజుకు 1,000-1,500 మంది రైతులను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతుల బాగుకా..? కంపెనీల లాభాలకా..? ప్రపంచ వ్యవసాయ సదస్సును పలు స్వచ్ఛంద, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బహుళ జాతి సంస్థల వ్యాపారాభివృద్ధికే సదస్సు నిర్వహిస్తున్నారని తూర్పారబడుతున్నాయి. సదస్సును అడ్డుకుంటామని సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితర పార్టీల అనుబంధ రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఐసీఏఆర్ సభ్యునిగా రైతులకు క్షమాపణ చెపుతున్నా సదస్సు నిజంగా సన్న, చిన్నకారు రైతుల కోసమే అయితే, రాష్ట్రంలోనే ఉన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.వీ. రావు లాంటి వారితోనో, ఐసీఏఆర్ డీజీ అయ్యప్పన్ లాంటి వారితోనో ప్రారంభోపన్యాసం చేయించి ఉండాల్సింది. అందుకు బదులుగా బేయర్ కంపెనీ అధిపతులతో ప్రారంభోపన్యాసం చేయించడంలోనే వారి ఉద్దేశాలు తేటతెల్లమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలిలో 4 రాష్ట్రాల రైతులకు ఏకైక ప్రతినిధిని నేను. కానీ, నాకు ఆహ్వానం రాలేదు. ఐసీఏఆర్ సభ్యునిగా రాష్ట్ర రైతులకు క్షమాపణ చెపుతున్నా. - ఎంవీఎస్ నాగిరెడ్డి, కన్వీనర్, వైఎస్సార్సీపీ రైతు విభాగం మేం బహిష్కరిస్తున్నాం: సన్న, చిన్నకారు రైతులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమే ఈ సదస్సు. చిన్న కమతాల సేద్యాన్ని కార్పొరేట్ సేద్యం కిందకు తెచ్చే ప్రయత్నాల్లో భాగమే ఈ సదస్సు. దీన్ని బహిష్కరిస్తున్నాం. సదస్సుకు వ్యతిరేకంగా సోమవారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద వామపక్ష భావాలు కలిగిన పది రైతు సంఘాలు, రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. - కె.రామకృష్ణ, సీపీఐ అనుబంధ రైతు సంఘం -
కర్షకుడి పేరు... కంపెనీల జోరు
సందర్భం: హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బేయర్‌కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. ప్రపంచ వ్యవసాయ సదస్సు కు ఈసారి హైదరాబాద్ వేదిక కాబోతోంది. నవంబర్ 4-7 తేదీలలో జరిగే ఈ సదస్సు నిర్వ హణలో రాష్ర్ట ప్రభుత్వం కూడా భాగస్వామే. ఇంతకీ ఈ సదస్సు ఎవరి కోసం? ఇది మన రైతులకు ఉపయోగపడితే సంతోషమే. ఈ సదస్సులు ప్రపంచ వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు (గత పదేళ్లుగా) ఒకసారి జరుగుతున్నాయి. తొలి ఐదు అమెరికాలోనూ గత సదస్సు బెల్జియం (బ్రస్సెల్స్)లోను జరిగాయి. సదస్సులతో ప్రపంచ వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశనం చేయడం ఈ వేదిక ఉద్దేశం. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం అందాలంటే అధిక ఉత్ప త్తితోనే సాధ్యమని ఇది స్పష్టం చేస్తున్నది. హరిత విప్లవా న్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆశిం చే ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇదే సూత్రాన్ని పాటించ మని ప్రైవేట్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం మీద ఒత్తి డి తెస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచ నలు కలిగిన వ్యక్తులు, సంస్థల కలయికే ఈ సదస్సు.చిన్న రైతులు, మహిళా రైతుల ప్రయోజనాల కోసం అని పత్రాలలో రాసుకున్నా ఆచరణలో వాటికి ప్రాధాన్యం కన పడదు. సదస్సు నిర్వాహక సంఘంలో ఒక్క మహిళ కూడా లేదు. పేరు గొప్ప... ఊరు దిబ్బ... చిన్న రైతులు లేదా వారి ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం లేదు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలక వచ్చినా కాయ రాక, వచ్చిన కాయకు సరైన మార్కెట్ ధర అందక రైతు ఇబ్బంది పడుతుంటే, ‘అధిక ఉత్పత్తి మా లక్ష్యం’ అనే నినాదంతో ఈ సదస్సు జరగబోతోంది. మరి సాగు సమ స్యలు ప్రస్తావించకుండా ఏం సాధిస్తారు? జన్యుమార్పిడి విత్తనాల వల్ల రైతుకు వచ్చే ప్రయోజ నం ఏమీ లేదని ఐదేళ్ల బిటీ పత్తి అనుభవంలో తేలింది. అలాంటి జన్యు మార్పిడి విత్తనాలను నెత్తికెత్తుకున్న డా॥కెన్నెత్ బేకర్ (చైర్మన్, ప్రపంచ వ్యవసాయ వేదిక) ఈ సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పెద్ద వ్యూహమే. డా॥కెన్నెత్ యూరోప్, ఆఫ్రికా ఖండాలలో మోన్శాంటో కంపెనీ ప్రతినిధి. మన పార్లమెంటులో, సుప్రీంకోర్టులో జన్యుమార్పిడి విత్తనాలను అనుమతిం చడం గురించి తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఈ సదస్సు ఏర్పాటయింది. దేశంలో విత్త నాల ఉత్పత్తిలో 90 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. విత్తన కంపెనీలు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయ కులు, అధికారులు కలిసిపోయి జన్యుమార్పిడి విత్తనాల అనుమతులకు మార్గం సుగమం చేయడానికే ఈ సదస్సును తలపెట్టారు. ఈ సదస్సుకు పెట్టుబడి పెట్టే వాళ్లలో మోన్శాంటో, బెయిర్ లాంటి పెద్ద కంపెనీలు ఉండటం గమనార్హం. మొదటి ఐదు సదస్సులు అమెరికాలోని మిస్సోరీలో జరిగాయి. వాటి చర్చనీయాంశాలు ఇవి: ఒకటి (20-22 మే, 2001) వ్యవసాయంలో కొత్త శకం: ప్రపంచానికి ఆహారం. రెండు: (8-20 మే, 2003) వ్యవసాయంలో కొత్త శకం: కలిసి భవిష్యత్తు నిర్మాణం, అడ్డంకుల తొల గింపు. మూడు: (6-18 మే, 2005) శాంతి, రక్షణ, వృద్ధికి మార్గం: స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యవసాయ - ఆహార వ్యవస్థలు. నాలుగు: (8-10 మే, 2007) వ్యవ సాయ పెట్టుబడుల ద్వారా సంపద సృష్టి. ఐదు:(18-20 మే, 2009) వ్యవసాయానికి సవాళ్లు. బెల్జియంలో (29 నవంబర్ - 1 డిసెంబర్, 2011) జరిగిన ఆరో సదస్సులో అంశం ‘పెరుగుతున్న ప్రపంచ జనాభా పోషణకి వ్యవ సాయంపై పునరాలోచన. రాష్ట్రంలో జరగబోయే ఏడో సద స్సులో ‘సుస్థిర భవిష్యత్తుకు వ్యవసాయ స్వరూపాన్ని మార్చడం: చిన్న రైతుల మీద దృష్టి’ అన్న అంశాన్ని తీసుకుంటున్నారు. ఆది నుంచీ వివాదాస్పదమే 1997లో ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ వేదిక వ్యవ సాయ విధానాల మీద చర్చలను నిర్వహించే తటస్థ సంస్థ అని చెప్పుకుంటుంది. కానీ వ్యవహారంలో ఇదెక్కడా కన పడదు. వేదిక రైతుల కోసం ఏర్పాటయినది కూడా కాదు. ఇది ఏటా తమ మార్కెట్ వాటాలను పెంచుకుంటున్న బహుళజాతి కంపెనీల వ్యాపార వేదిక. ప్రపంచ వ్యవ సాయాన్ని వారి వ్యాపారాలకు అనుగుణంగా మార్చడమే ప్రధాన ధ్యేయంగా కనపడుతుంది. పెద్ద కమతాలలో ఆధునిక వనరులను పెద్ద ఎత్తున ఉపయోగించి చేసే సేద్యం గురించిన వ్యూహాలే కనిపిస్తాయి. జన్యుమార్పిడి పంటల పరిశోధన, ఉత్పత్తి, అను మతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యం కీలక దశకు చేరింది. కోర్టు నియమించిన టెన్నికల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక జీవరక్షణ, భద్రత చర్యలు లేకుండా జన్యుమార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షలు నిర్వహిం చరాదని చెబుతున్నది. తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అటు పార్లమెంటులో బీఆర్‌ఏఐ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అనేక అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్థాయీ సం ఘం ముందుంది. ఈ సంఘం ఇప్పటికే జన్యుమార్పిడి పంటల అవసరం మన సేద్యానికి లేదని నివేదించింది. కేంద్ర వ్యవసాయ, పర్యావరణ మంత్రిత్వశాఖల మధ్య ఈ పంటలకు అనుమతి ఇవ్వడం గురించి ఏకాభిప్రాయం లేదు. ఈ తరుణంలో సదస్సు ఏర్పాటు చేయడమంటే మన వ్యవసాయ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే. హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బెయ ర్కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరి హారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. తుపానులతో దెబ్బ తిన్న రైతాంగాన్ని చూడటానికి కూడా రాని కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సదస్సుకు రావాలని నిర్ణయించుకోవడం శోచ నీయం. 2011 సమావేశంలో జేమ్స్ బోల్గేర్, (చైర్మన్, అం తర్జాతీయ సలహా సంఘం) జన్యు మార్పిడి పంటల ఆవ శ్యకతను గుర్తు చేశారు. వ్యాట్ వెబ్సైట్ ప్రకారం వారి సహకారం అందించే సంస్థలలో ప్రపంచ బ్యాంకు, డబ్లు. కె.కెల్లోగ్ ఫౌండేషన్, మోన్శాంటో, టైసన్, డీఐ ఆయిల్స్, కార్పొరేట్ కౌన్సిల్ ఆన్ ఆఫ్రికా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ద వరల్డ్ ఫుడ్ ప్రైస్ పార్టనర్షిప్ టు ఎండ్ హంగర్ ఇన్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా మోన్శాంటో కంపెనీకి అనుగుణంగా పని చేస్తున్నవే. మేలు చేయని ఆలోచనలు గత సమావేశాలలో వేటిలోనూ రైతులు పాల్గొన్న దాఖ లాలులేవు. బ్రస్సెల్స్ సమావేశాలలో ప్రసంగించిన వారి లో ఎవరూ రైతులుకాదు. సమావేశాల తీరు, భాష కూడా అంతర్జాతీయమే. ఎక్కువగా, రౌండ్ టేబుల్ సమావేశాలే. వారి చర్చనీయాంశాలు ఇవి. వ్యవసాయంపైన పునరాలోచన- సమస్యలు: (వ్యవ సాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కడ నుంచి వస్తుం ది? ఇది నూతన ప్రపంచ ఒరవడికి దారితీస్తుందా? /రైతుల నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది?/ వ్యవ సాయానికి ఆధునిక టెక్నాలజీ: సవాళ్లు./ప్రపంచ వాణిజ్య ఏర్పాటు ద్వారా ఆహార భద్రత. /గొలుసు కట్టు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా నుంచి ఉప యోగాలు ఎలా రాబట్టాలి?) వ్యవసాయంపైన పునరాలోచన- సాధ్యమయ్యే పరి ష్కారాలు: (వ్యవసాయానికి ఒక నూతన దృష్టి: మార్కెట్ ఆధార పరిష్కారాలు./తక్కువ నుంచి ఎక్కువ: సమాజ వనరుల సుస్థిర ఉపయోగంలో మార్పులు. /వ్యవసాయంలో పెట్టుబడులకు సూత్రా లు. /వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడులకు ప్రోత్సాహం.) {పపంచ వ్యవసాయంపైన పునరాలోచన: భవిష్య త్తుకు అవసరమైన నిధులు, యాజమాన్యం (వ్యవ సాయ ఉత్పత్తుల మార్కెట్: నియంత్రణ అవస రమా?/వాణిజ్యం, ఆర్థిక అంశాలు.) ఈ శీర్షికలు, చర్చనీయాంశాలు సామాన్య రైతుకు కాదు, ఇది చూడగానే అర్థమవుతుంది. వ్యవసాయం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఉపయోగపడేవి మాత్రమే. ఒరిగేదేమీ లేదు... హైదరాబాద్ సదస్సులోను ఈ తరహా శీర్షిక లే ఉండబోతు న్నాయి. ఇందులో రాష్ట్రంలో పురుగు మందులు లేకుండా లక్షల ఎకరాలలో జరుగుతున్న వ్యవసాయం గురించి లేదు. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడుల ప్రస్తావన లేదు. వ్యవసాయం ద్వారా సాధ్యమయ్యే ఆహా ర భద్రత గురించీ లేదు. రైతులు ఇందులో పాల్గొనే అవకా శాలు తక్కువ. ప్రవేశ రుసుం రాష్ర్ట ప్రభుత్వం భరించినా, భాష ఒక సమస్య. అనువాదకులు ఉన్నా, సంబంధం లేని విషయాలు అర్థం చేసుకునే అవకాశం రైతులకు లేదు. ప్రపంచ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిం చినా మనకు నష్టమే తప్ప లాభం లేదు. మన వ్యవసాయ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన శాస్త్ర వేత్తలు, అధికారులు, రైతులు చర్చించుకోవాలి. ముఖ్యం గా రైతుల స్వాతంత్య్రాన్ని హరించే సదస్సులకు ప్రజా ధనం వినియోగపడరాదు. - డాక్టర్ డి.నరసింహారెడ్డి వ్యవసాయ విశ్లేషకులు