![AP BJP Kanna Lakshminarayana In Comments On TDP Govt YSR Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/9/KANNA.jpg.webp?itok=dcEd6xWZ)
కన్నాలక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు
బద్వేలు అర్బన్ : నాడు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీనే కావాలని పట్టుబట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు యూటర్న్ తీసుకుని హోదా కావాలని దొంగ దీక్షలు చేస్తున్నారని, కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసమే టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఏమాత్రం స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కన్నా తెలిపారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని బలిజ సేవా సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్‌డ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నానబాలవెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు బాబాఫకృద్దీన్, సీనియర్ నాయకులు రమణయ్య, ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment