
ఇక ఏ రాష్ట్రానికీ 'హోదా' సాధ్యం కాదు
ఇక నుంచి దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఇక నుంచి దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే అధికంగా కేంద్రం నిధులిస్తుందని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజి విషయమై జరుగుతున్న హడావుడి నేపథ్యంలో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇస్తే దానికి కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 1.40 లక్షల కోట్ల సాయం చేసిందని కన్నా తెలిపారు.