సాక్షి, అమరావతి: గరుడు పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని అణవేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుకాదని.. హోదాకు సమానమైన ఆర్థిక సాయం కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు అంగీకరించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేదుకే బీజేపీపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని, అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని అభిప్రాయపడ్డారు. ఏపీలోనే కాక.. దేశమంతా బీజేపీపైపు చూస్తోందని, యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment