సాక్షి, గుంటూరు: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎంతో మంది పేదలకు భరోసా కలుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి పోరాటాలు లేకుండానే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. 70 ఏళ్లలో ఏ ప్రధాని తీసుకోని నిర్ణయం మోదీ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణ పేదల గుండెల్లో మోదీ దేవుడిగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ గురించి మాట్లాడేటప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మోదీ నిర్ణయంతో చంద్రబాబుకి దిమ్మ తిరిగిందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల అనుభవం దోచుకోవడానికి, దాచుకోవడానికేనా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధి పనులకే చంద్రబాబు ప్రారంభాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పోలవరంపై నాణ్యతను గాలికొదిలి ప్రచారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ చేసిన పనికి చంద్రబాబు సంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment