సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని వెల్లడించారు.