
సాక్షి, ప్రకాశం : సీఎం చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని, దేశాన్ని దోచుకోవడానికి మరికొంత మంది దొంగలను ఏకంచేసే ప్రయత్నాలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పాత్రధారులు కాంగ్రెస్ పెద్దలేనని ధ్వజమెత్తారు. దేశానికి ప్రధాని నరేంద్రమోదీ అవసరం చాలా ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే, పాకిస్థాన్‌లో సంబరాలు చేసుకున్నారని గుర్తుచేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని తిట్టిన చంద్రబాబు, అదే తల్లి కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా కలిశారని కన్నా నిప్పులు చెరిగారు. సీఎం మానసిక పరిస్థితి అంత బాగోలేదు, కేసీఆర్‌ని ముందుగా రెచ్చగొట్టింది చంద్రబాబే అన్నారు.