(ఫైల్ ఫోటో)
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విపత్కర సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డి పై నీచమైన కామెంట్లు చేసినందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారన్నారు. బీజేపీకి అండగా అండగా ఉంటున్న జనసేనతో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రపంచంలో భారత దేశం ముందుంటే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని జాతీయ మీడియా ప్రకటించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు సహా ఇతర టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రికి నివేదించానంటూ కొట్ట సత్యనారాయణ పేర్కొన్నారు. అంతకముందు తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాణిజ్య, వ్యాపార, డ్వాక్రా మహిళలు తదితర వర్గాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటానికి మద్దతుగా ఇచ్చిన విరాళాలను బుధవారం అమరావతిలో సీఎంను కలిసి రూ. 2 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. మంచి సమాజం రావాలంటే అందరూ సహకరించాలి అలా సహకరించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment