సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా కష్టాలతో చిక్కుకుపోయిన కార్మికులు తమకు భోజనాలు పెట్టడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారన్న కారణంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై అమానుషంగా దాడి జరిపిన ఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని పెడతాడేపల్లిలో శ్రీ శ్రీనివాస స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒడిశా, బీహార్, అస్సాం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 300 మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పిన్నింగ్ మిల్ ప్రొడక్షన్‌ను ఆపేసింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులంతా ఫ్యాక్టరీ వదే చిక్కుకుపోయారు. యాజమాన్యం తమను పట్టించుకోవట్లేదని, 300 మంది కార్మికులు ఉంటే 150 మందికి భోజనాలు పంపించి సరిపెట్టుకోవలని చెప్తున్నారంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇంతవరకు తమకు ఇవ్వవలసిన జీతం కూడా చెల్లించలేదంటూ తెలిపారు. కార్మికుల ఫిర్యాదు మేరకు కొట్టు విశాల్ స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో ఉండిపోయిన కార్మికులందరికి భోజనాలు ఏర్పాటు చేస్తానని, మీ అందరికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మేనేజర్ విజయ్ పాల్ నర్సీపట్నంకు చెందిన జుబ్బాల చిన్నా అనే కార్మికుడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని కార్మికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment