tadepallidudem
-
తాడేపల్లిగూడెం పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. ముగ్గురు సజీవదహనం! -
చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: సజ్జల
తాడేపల్లి: చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి పక్షాలు ఏక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై కావాలనే విషప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. హెరాయిన్, డ్రగ్స్‌లకు ఏపీ అడ్డగా మారిందని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు దిగజారీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాల్లో అడ్డమైన కథనాలు రాయించుకుంటున్నారని సజ్జల విమర్శించారు. హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల తెలిపారు. టీడీపీ వాళ్లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారేమోనన్న అనుమానం ఉందని విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల డ్రగ్స్ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణాను చూసీ చూడనట్లు వదిలేశారని అన్నారు. దీనిపై సీఎం జగన్ ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినందువల్లే.. గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా.. చంద్రబాబుకు సిగ్గులేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్‌లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
‘పవన్ కళ్యాణ్ నటుడు, చంద్రబాబు సహజ నటుడు’
-
‘పవన్ కళ్యాణ్ నటుడు, చంద్రబాబు సహజ నటుడు’
తాడేపల్లి: ‘పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు రాజకీయాల్లో సహజ నటుడు’ అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనే ప్రజలు ఈ రెండు పార్టీలను ఛీ కొట్టినా వారిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ఆ పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని చురకలంటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లభ్దిదారులకు అందాల్సిన సొమ్మును నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన రాళ్లదాడి హైడ్రామాను ప్రజలు గమనించారన్నారు. ‘టీడీపీ పనైపోయింది’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా చెప్తున్నారని విమర్శించారు. లోకేష్ దెబ్బకు టీడీపీ దివాళా తీసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని, దీన్నిబట్టి ఆ పార్టీ నేతలకి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుధ్ది ఉందో తెలిసిపోతుందన్నారు. చదవండి: లోకేష్, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం -
కార్మికులపై యాజమాన్యం అమానుష ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా కష్టాలతో చిక్కుకుపోయిన కార్మికులు తమకు భోజనాలు పెట్టడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారన్న కారణంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై అమానుషంగా దాడి జరిపిన ఘటన తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని పెడతాడేపల్లిలో శ్రీ శ్రీనివాస స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒడిశా, బీహార్, అస్సాం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 300 మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పిన్నింగ్ మిల్ ప్రొడక్షన్‌ను ఆపేసింది. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులంతా ఫ్యాక్టరీ వదే చిక్కుకుపోయారు. యాజమాన్యం తమను పట్టించుకోవట్లేదని, 300 మంది కార్మికులు ఉంటే 150 మందికి భోజనాలు పంపించి సరిపెట్టుకోవలని చెప్తున్నారంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇంతవరకు తమకు ఇవ్వవలసిన జీతం కూడా చెల్లించలేదంటూ తెలిపారు. కార్మికుల ఫిర్యాదు మేరకు కొట్టు విశాల్ స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో ఉండిపోయిన కార్మికులందరికి భోజనాలు ఏర్పాటు చేస్తానని, మీ అందరికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మేనేజర్ విజయ్ పాల్ నర్సీపట్నంకు చెందిన జుబ్బాల చిన్నా అనే కార్మికుడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని కార్మికులు పేర్కొన్నారు. -
తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవంలో పొల్గొన్న ఉపరాష్ట్రపతి
-
‘ఇంగ్లీషు నేర్చుకోవడంలో తప్పు లేదు’
సాక్షి, పశ్చిమ గోదావరి: తెలంగాణకు వెళ్లినా, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుగతున్న మొదటి స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. భాష, భావం రెండు కలిసి నడుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృ భాషలోనే మాట్లాడాలని.. ఇంగ్లీషు నెర్చుకోవటంలో తప్పు లేదన్నారు. భాషలు, వేషాలు వేరు కావచ్చు కానీ మనమంతా ఒక్కటే అని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వానికి విరుద్దంగా ప్రవర్తించకుడాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు నేరుగా ఏ విధంగా చేరాలో సాంకేతిక పరిజ్ఞానం తెలియజేయాలన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు సూచించారు. ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయంపై ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నీటి కోసం పోరాడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. వియత్నాంలో వరిని మన ఎంఎస్ స్వామినాథన్ పరిచయం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అటువంటి మనం ఎందుకు ఉత్పత్తి చెయలేకపోతున్నామని ఆలోచించాలన్నారు. రైతులకు మంచి సామర్థ్యం కలిగిన విద్యుత్ అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, స్త్రీ శిశు శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరూకువాడ రంగనాధారాజు, పార్లమెంటు సభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు పాల్గొన్నారు. -
మహిళా వీఆర్ఏకు లైంగిక వేధింపులు
సాక్షి, తాడేపల్లిగూడెం/పశ్చిమ గోదావరి : తాడేపల్లిగూడెం తహసిల్దార్ కార్యాలయంలోని ఓ మహిళా వీఆర్ఏతో మండలానికి చెందిన అప్పారావుపేట వీఆర్వో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఏపీ స్టేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ నాయకుడు జి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోమవారం వివరాలు వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహిళా వీఆర్ఏ పట్ల కొంత కాలంగా అప్పారావుపేట వీఆర్వో ఆర్వీ పోతురాజు అసభ్యంగా ప్రవరిస్తున్నాడని, బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. తహసిల్దార్ ఆదేశానుసారం ఆదివారం పనిచేసేందుకు వచ్చిన ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వో చేయి పట్టుకున్నాడని ఆరోపించారు. వేధింపులపై సదరు మహిళా వీఆర్ఏ తమ యూనియన్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అప్పారావుపేట వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. లేదంటే ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళతామని వెల్లడించారు. దీనిపై తహసిల్దార్ ప్రసాద్ వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
టీడీపీపై అమిత్ షాకు ఏపీ మంత్రి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: టీడీపీ - బీజేపీల మధ్య నిట్ ఏర్పాటుపై పంచాయితీ జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిపాదనలు చేశారు. మంత్రి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం కమిటీ అందుకు ఆమోదం తెలిపింది. అయితే ఇందులో తిరకాసు లేకపోలేదు. అదేమంటే.. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తే బీజేపీకి మంచి మార్కులు వస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు సూచించారు. అయితే నిట్ విషయంలో టీడీపీ వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదుచేశారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మాణిక్యాలరావు బెదిరించడంతో టీడీపీ వర్గీయులు వెనక్కి తగ్గారన్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. గడువు తీరిన తర్వాత లేఖ పంపి ఏపీ సర్కారు పొడిచిందని మాణిక్యాలరావు ఆవేదన చెందినట్లు సమాచారం. తమ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఎదగనీయకుండా టీడీపీ కుట్ర పన్నుతుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.