టీడీపీపై అమిత్ షాకు ఏపీ మంత్రి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: టీడీపీ - బీజేపీల మధ్య నిట్ ఏర్పాటుపై పంచాయితీ జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిపాదనలు చేశారు. మంత్రి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం కమిటీ అందుకు ఆమోదం తెలిపింది. అయితే ఇందులో తిరకాసు లేకపోలేదు. అదేమంటే.. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తే బీజేపీకి మంచి మార్కులు వస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు సూచించారు. అయితే నిట్ విషయంలో టీడీపీ వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదుచేశారు.
మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మాణిక్యాలరావు బెదిరించడంతో టీడీపీ వర్గీయులు వెనక్కి తగ్గారన్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. గడువు తీరిన తర్వాత లేఖ పంపి ఏపీ సర్కారు పొడిచిందని మాణిక్యాలరావు ఆవేదన చెందినట్లు సమాచారం. తమ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఎదగనీయకుండా టీడీపీ కుట్ర పన్నుతుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.