
సాక్షి, పశ్చిమగోదావరి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల చేసిన రాళ్ల దాడి దారుణమని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. జాతీయ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే.. సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే సమీక్షించి.. శాంతి భద్రతల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను మాజీ మంత్రి మాణిక్యాలరావు కోరారు.
ఈ ఘటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలిపి, గో బ్యాక్ నినాదాలు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే.