
ఎగుమతులు లేక నిలిచిపోయిన కొబ్బరికాయల రాశి
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: కొబ్బరి పరిశ్రమను కరోనా కాటేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కొబ్బరి ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కొబ్బరి, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడ్డ వేలాదిమంది కార్మికులు, చిరుద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కొబ్బరికి మంచి ధర ఉన్నా కాయను అమ్మలేని పరిస్థితి. పాలకొల్లు కేంద్రంగా 100 షాపుల్లో రోజూ సుమారు 25 లారీల్లో కొబ్బరి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. రోజూ సుమారు 7 నుంచి 8 లక్షల కొబ్బరికాయలు ఎగుమతి అవుతాయి. పాలకొల్లు పట్టణ, పరిసర ప్రాంతాల్లో 600 మంది ఎగుమతి కూలీలు, 1000 మంది ఒలుపు కార్మికులు, 250 మంది గుమస్తాలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా రెండు నెలల వరకు కొబ్బరి ఎగుమతులు, దిగుమతులకు వీలులేని పరిస్థితి. అలాగే ధర కూడా పడిపోతుందని ఉభయ గోదావరి జిల్లాల కొబ్బరి ఎగుమతుల సంఘం మాజీ కార్యదర్శి మాటూరి వీర వెంకట నరసింహమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment