ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రజలందరినీ భాగస్వాములనుచేసి రచ్చబండ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రమంత్రులు పితాని సత్యనారాయణ, ఎన్ రఘువీరారెడ్డి, డీ శ్రీధర్‌లతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో తీసుకోవలసిన చర్యల గురించి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మొదటి విడత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించి, రెండో విడతలో వచ్చిన రేషన్‌కార్డులు, గృహ నిర్మాణాలకు మంజూరు పత్రాలు, పింఛన్లు పంపిణీ చే శారన్నారు. రెండో విడతలో వచ్చిన అర్జీలను పరిష్కరించి మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తా జాగా జరగనున్న రచ్చబండలో 17 లక్షల 94 వేల గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారన్నారు. 4 లక్షల 98 వేల ఎస్సీ కుటుంబాలు, 5 లక్షల 15 వేల ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మట్టితో మెరక పెంచేందుకు నిధులు మం జూ రు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణను కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, సీపీఓ కేటీ వెంకయ్య, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ కే పోలప్ప పాల్గొన్నారు.
11 నుంచి మూడో విడత రచ్చబండ
Published Thu, Nov 7 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement