(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో రథం తగలబెట్టి, దేవాలయాలను కూల్చివేసిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదే విధంగా పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)పై పార్లమెంటులో చట్టం చేసినప్పటీ నుంచి కాంగ్రెస్, వామపక్షాలు క్షేత్రస్థాయిలో ప్రజల్ని రెచ్చగొడుతున్నాయన్నారు. భారతదేశంలో ఎన్‌ఆర్‌సీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నోసార్లు స్పష్టం చేశారని ఆయన తెలిపారు.
రిజర్వేషన్ల అంశంపై మార్పు చేయడం జరగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డాయని మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీ లేదని చెబుతున్నా అసదుద్దీన్ ఒవైసీ గుంటూరులో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఓవైసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల భారతదేశంలో ఏ ఒక్క ముస్లింలకు అన్యాయం జరగదని కన్నా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment